హాయ్ ప్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు వెరైటీగా బ్రెడ్ ఇంకా గోధుమ రవ్వ తో టేస్టీ బ్రెడ్ దోస తయారు చేయడం చూద్దాం.
దోస:-
దోస ఈ పేరు వినగానే చాలా మందికి తినాలనిపిస్తుంది. అందరికీ చాలా ఇష్టమైన అల్పాహారం దోస. మనం చాలా రకాల దోసలను చూస్తుంటాం. అలాగే చాలా వరైటీ గా కూడా ట్రై చేస్తుంటాం. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు దోసలు చేసుకుంటారు. నేను కూడా చాలా రకాల దొసలు ట్రై చేశాను. చేస్తూనే ఉంటాను. నేను చేసినవన్నీ తప్పకుండా మీకు తెలియజేస్తాను. ఇంతకుముందు నేను పోస్ట్ చేశాను కొన్ని టిఫిన్స్ వాటిని కూడా ట్రై చేయండి. ఇప్పుడు బ్రెడ్ దోస తయారు చేసే పద్ధతి చూద్దాం.
కావలసిన పదార్థాలు:-
బ్రెడ్ ముక్కలు 2 కప్పులు
గోధుమ రవ్వ 1 కప్పు
చిక్కటి మజ్జిగ 2 కప్పులు
మైదాపిండి 1 కప్పు
ఉప్పు తగినంత
నూనె సరిపడా
వంట సోడా చిటికెడు
తయారు చేయు విధానం:-
దోస చేసుకోవానికి కావలసిన పదార్థాలు అన్ని సిద్దం చేసి పెట్టుకోవాలి.
గోధుమ రవ్వ ను ముందుగ నానపెట్టుకోవాలి.నానడానికి టైం పడుతుంది .కాబట్టి కావలసినవన్నీ ముందుగ నానపెట్టి పెట్టుకోవాలి.
బ్రెడ్ ముక్కలుగా చేసి ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి నానపెట్టాలి.
గోధుమ రవ్వను బాగా కడిగి తగినన్ని నీళ్ళు పోసి రెండు గంటలు నానపెట్టుకోవాలి.
రెండు కప్పుల మజ్జిగలో ఒక కప్పు మైదా పిండి ని వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి.
కలిపినా మజ్జిగ ,మైదాపిండి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి.మైదా పిండి మజ్జిగ లో నానుతుంది.
రెండు గంటల తర్వాత గోధుమ రవ్వ ను మిక్సిలో వేసి మెత్తగా దోసల పిండిలా రుబ్బుకోవాలి.
రుబ్బుకున్న దోసల పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. మిగతావి కూడా కలుపుకోవడానికి వీలుగా పెద్ద గిన్నె తీసుకోవాలి.
నానపెట్టిన బ్రెడ్ ని కూడా మిక్సి లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.బ్రెడ్ మిశ్రమం ని కూడా గోధుమ రవ్వ మిశ్రమం లో వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు గోధుమ రవ్వ ,బ్రెడ్ మిశ్రమం,మైదా పిండి ,మజ్జిగ లను అన్నిటిని ఒక గిన్నెలో వేసి బాగా అన్ని కలిసేలా కలుపుకోవాలి.
ఇప్పుడు దోస పిండిలో తగినంత ఉప్పు ,చిటికెడు వంట సోడా వేసి కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి.
ఒక రెండు గంటల తర్వాత పిండి దోసలు వేసుకోవడానికి సిద్దం అవుతుంది.
పిండి మరి గట్టిగ ఉంటె కొన్ని పోసుకొని జారుడుగా చేసుకోవాలి.మొత్తం పిండిలో ఒకేసారి నిల్లు పోసి కలుపుకుంటే మొత్తం పిండిని ఒకేసారి దోసలు వేసుకోలేము.
కాబట్టి మనకి కవలసినంత పిండికి మాత్రం నీళ్ళు కలుపుకోవాలి. నీళ్ళు కలిపినా పిండి ఎక్కువ సేపు ఉండదు. తొందరగా పులిసిపోతుంది.
స్టవ్ వెలిగించి దోస పాన్ పెట్టుకొని వేడిచేసుకోవాలి.దోస పాన్ ఫై కొద్దిగా నీళ్ళు చిలకరించి బట్ట తో తుడిచి దోస పిండి తీసుకోని పెనం ఫై వేసి సన్నని దోస చేసుకోవాలి.
కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి.అంతే దోస రెడీ .
పల్లి చట్నీ ,టమాటో చట్నీ ఎ చట్నీ ఐన సూపర్ గా ఉంటుంది.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: వడలు (మినప గారెలు)/ vada / garelu
Post a Comment
If you have any doubts, Please let me know.