వడలు (మినప గారెలు)/ vada / garelu

హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం వడలు తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.

వడలు:-

వడలు హోటల్లో చేసే వడల్ల టెస్ట్ గా రావాలంటే ఇలా చేయండి. చాలా రుచిగా ఉంటాయి.మినపప్పు ఆరోగ్యానికి చాలా బలం.ట్రై చెయ్యండి.

minapa vada

కావలసిన పదార్థాలు:-

మినప్పప్పు

పచ్చి మిర్చి ముక్కలు

ఉల్లిపాయ ముక్కలు

కొత్తిమీర

పెరుగు

ఉప్పు

వంట సోడా

తయారు చేసే విధానం:-

  • వడలు చేసుకోవడానికి కావలసినవన్నీ సిద్దంచేసుకోవాలి.

  • ముందుగా మినప్పప్పు ఒక రెండు గంటలు నానపెట్టాలి.
  • నానిన తర్వాత మిక్సిలో వేసి నీళ్ళు వేయకుండా మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ లో పచ్చి మిర్చి ముక్కలు,ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేసి మినప్పప్పు లో కలపాలి.
  • తర్వాత పిండిలో కొద్దిగా పెరుగు, వంట సోడా వేసి కలిపి నాలుగు గంటలు పక్కన పెట్టుకోవాలి.
  • కుదరకా పోతే వెంటనే ఐన చేసుకోవచ్చు.పిండిని బాగా కలుపుకోవాలి.
  • స్టౌ వెలిగించి పాన్ లో నూనె పోసి బాగా కాగాక అందులో వడలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి.
  • పల్లీ చట్నీ ,టమాటో చట్నీ తో తింటే ఈ గారెలు చాలా రుచిగా ఉంటాయి.
  • అంతే రుచికరమైన వడలు / గారెలు రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి.
నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️