వెరైటి మసాలా దోస / variety masala dosa

హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం వెరైటి మసాలా దోస తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.

దోసలు :-

మనం చాలా రకాల దోసలు తయారు చేస్తాం. ప్లైన్ దోస ,మసాలా దోస,ఆనియన్ దోస, పెసర పప్పు దోస, రవ్వ దోస, గోధుమ పిండి దోస  ఇలా చాలా రకాల దోసలు  ఉన్నాయి. ఈరోజు వెరైటి మసాలా దోస నేర్చుకుందాం. ఇందులో కొన్ని నేను పోస్ట్ చేశాను. చేయనివి తప్పకుండా పోస్ట్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి.

masala dosa


కావలసిన పదార్ధాలు:-


మినపప్ప్పు  సగం కప్పు

మెంతులు ఒక చెంచా

సెగనపప్పు సగం కప్పు

వంటసోడా చిటికెడు

బియ్యం 3 కప్పులు

పెసరపప్పు  సగం కప్పు

జీలకర్ర 2 చెంచాలు

అల్లం చిన్న ముక్క 

పచ్చిమిర్చి ఒక ఐదు లేదా ఆరు

ఉప్పు కొద్దిగా

నూనె సరిపడ


తయారు చేయు విధానం:-

  • బియ్యం, పప్పులు, మెంతులు  బాగా కడిగి కలిపి 5 నుంచి 6 గంటలు నాననివ్వాలి.

  • అన్నీ విడి విడిగా ఐన సరే నాన బెట్టాలి.

  • నానిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

  • చివరగా ఒక జార్ లో పచ్చి మిర్చి, ముక్కలు, అల్లం, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బాలి.

  • ఈ పిండి మిగతా పిండిలో కలిపి బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి.

  • చివరగా ఉప్పు,వంటసోడా కలిపి నాలుగు గంటలు ప్రక్కన ఉంచాలి.

  • పొంగిన పిండినీ బాగా కలిపి స్టవ్ వెలిగించి పాన్ పెట్టీ వేడి చేసుకోవాలి.

  • కాలిన పెనంపై పల్చటి దోసె వేసి తగినంత నూనె వేసి ఎర్రగా కాల్చి వేడి వేడిగా సర్వ్ చెయ్యాలి.

  • అంతే రుచికరమైన వెరైటీ దోస రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

Also read: తోటకూర పెసర పప్పు కూర / thotakura pesarapappu curry

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️