హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గారసం పొడి ఎలా చేయాలో చూద్దాం.
రసం పొడి :-
చలికాలంలో చాలా మందికి రసం పెట్టడం అలవాటు.జలుబు దగ్గు అజీర్తి వంటి చిన్నచిన్న సమస్యలకు మంచి చిట్కా. అయితే రసం పొడి ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికోసం చాలా మంది చాలా రకాలుగా చేస్తూంటారు. నేను తయారుచేసే విధానం గురించి చెప్తాను..
కావలసిన పదార్థాలు:-
జీలకర్ర ఒక స్పూన్
మిరియాలు ఒక స్పూన్
ఎండు మిరపకాయలు పది
ధనియాలు ఒక కప్పు
వెల్లుల్లి ఒక గడ్డ
కరివేపాకు రెండు రెమ్మలు
ఇంగువ పావు స్పూను
మినపప్పు ఒక స్పూన్
శనగపప్పు ఒక స్పూన్
సోంపు కొద్దిగా
చిటికెడు ఉప్పు
తయారు చేసే విధానం:-
- ముందుగా కావలసిన పదార్థాలు అన్నీ సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి .
- ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వేడి చేసుకోవాలి .
- తర్వాత కడాయిలో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ,మిరియాలు, ధనియాలు ,తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు, మినప్పప్పు ,శనగపప్పు, సోంపు అన్ని వేసి ఫ్రై చేసుకోవాలి .
- అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి కొన్ని నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
- ఫ్రై అయిన తర్వాత చివరకు ఎండు మిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి .
- ఎందుకంటే ఎండు మిరపకాయలు చాలా ఘాటుగా ఉంటాయి కాబట్టి ముందే అన్నింటితో కలిపి వేస్తే ఘాటు వస్తుంది.అలాగే అవి అవి మాడిపోతుంది .
- వీటన్నింటినీ కూడా నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి .ఇప్పుడు పదార్థాలని చల్లార్చుకోవాలి .
- చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మిక్సీ పట్టుకోవాలి .
- తయారు చేసుకున్న పొడిని గాలిచొరబడని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి .
- దీన్ని 15 నుంచి నెల రోజుల వరకు వాడుకోవచ్చు నీళ్లు పడకుండా చూసుకోవాలి ఒకవేళ నీళ్లు పడినట్లయితే రసం పొడి పడుతుంది .
- అంతే రుచికరమైన రసం పొడి రెడీ .
Also read: పొటాటో అటుకుల రోల్స్ / potato poha rolls
Post a Comment
If you have any doubts, Please let me know.