హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.
లివర్ :-
సాదారణంగా మనం ఎక్కువగా చికెన్, మటన్ కర్రీ లు చేసుకుంటాము. వెరైటీగా చికెన్ లివర్ మరియు హార్ట్ తో ఫ్రై చేసుకొని చూడండి.చాలా చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. తప్పకుండా ట్రై చేయండి. పప్పు చారులోకి లివర్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది.తింటాం.ఎలా చేయాలో నేర్చుకుందాం.
కావలసిన పదార్థాలు :-
చికెన్ లివర్ అరకేజీ
పసుపు
కారం తగినంత
దనియాల పొడి
ఉల్లిపాయ ముక్కలు
టమోటా
అల్లం వెల్లుల్లి పేస్టు
జీలకర్ర
గరంమసాలా
కొత్తిమీర
పచ్చిమిర్చి రెండు
కరివేపాకు రెబ్బలు
ఉప్పు రుచికి సరిపడా
తయారు చేసే విధానం:-
చికెన్ లివర్ ను ఉప్పు ,పసుపు వేసి శుభ్రంగా కడిగి కావలసిన సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి.
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
స్టౌ వెలిగించి కళాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర,పచ్చి మిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేగించాలి.
ఇప్పుడు చికెన్ లివర్ వేసి బాగా కలిపి మూత పెట్టీ ఐదు నిమిషాలు ఉడికించాలి.
ముక్కలు మెత్తబడ్డాక కారం, ఉప్పు వేసి పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
మంచిగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
అంతే క్రిస్పీ లివర్ ఫ్రై రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: రసం పొడి / rasam powder
Post a Comment
If you have any doubts, Please let me know.