దొండకాయ పులుసు / Dondakaya pulusu

హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం దొండకాయ పులుసు తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.

dondakaya pulusu

కావలసిన పదార్థాలు:-

దొండకాయ

నూనె

జీలకర్ర

ఆవాలు

ఉప్పు

కారం

మెంతులు

చింత పండు గుజ్జు

ధనియాల పొడి

పసుపు

అల్లం వెల్లుల్లి పేస్ట్

కొత్తిమీర

ఉల్లిపాయలు

తయారు చేసే విధానం:-

  • ముందుగా దొండకాయ ను నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలు విడిపోకుండా అలాగే ఉండాలి. మసాలా వంకాయ ముక్కలు లాగా ఉండాలి.

  • ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, అవాలు, ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.

  • తర్వాత అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దొండకాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టీ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.

  • ఇప్పుడు అందులో తగినంత కారం,ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి.

  • ఒక నిముషం తర్వాత అందులో చింత పండు గుజ్జును వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి.

  • పది నిమిషాలు ఉడికించి అందులో కొద్దిగా మెంతిపొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసి దించేయాలి.

  • అంతే రుచికరమైన దొండకాయ పులుసు కూర రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️