ఆలూ వెజిటబుల్ టిక్కి / Aloo vegetable tikki

హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం వెరైటీ ఆలూ వెజిటబుల్ టిక్కి తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.

ఆలూ వెజిటబుల్ టిక్కి :-

ఆలూ గడ్డ తో చాలా రకాల వంటలు మనమ చేసుకుంటాము.ఆలూ గడ్డని చాలా రకాల కూరగాయలతో కలిపి కలిపి కూరలు చేసుకుంటాము .అలాగే చాలా రకాల స్నాక్స్ కూడా చేసుకుంటాం.ఈరోజు వెరైటీ గా ఆలూ వెజిటబుల్ టిక్కి చేద్దాం.



కావలసిన పదార్థాలు:-

ఆలూ

క్యారట్

బీన్స్

గ్రీన్ బఠాణీ

రెండు స్పూన్లు శెనగపిండి

పచ్చి మిర్చి

పసుపు

నూనె

కారం

కొత్తిమీర

ఉల్లిపాయలు

జీలకర్ర

వాము

తయారు చేసే విధానం:-

  • ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి అందులో కూరగాయల ముక్కలు (ఆలూ, క్యారట్, బీన్స్, బఠాణీ) వేసి చిటికెడు ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి.
  • ఉడికించిన కూరగాయల ముక్కలు కొద్దిగా మేదుపుకోవలి.
  • ఇప్పుడు అన్ని కూరగాయల ముక్కలు వేసి ఒక గిన్నలోకి తీసుకోవాలి. అందులో తగినంతకారం,ఉప్పు,పసుపు,వాము,జీలకర్ర కొత్తిమీర, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, సెనగపిండి అన్ని బాగా కలపాలి.
  • స్టౌ వెలిగించి పాన్ లో కొద్దిగా నూనె పోసి చిన్న చిన్న టిక్కి లాగా చేసుకొని పెనం పై రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి.
  • టమోటో సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది.
  • అంతే రుచికరమైన వెరైటీ ఆలూ వెజిటబుల్ టిక్కి రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️