చిక్కుడుకాయ టమోటా కూర / chikkudukaya tomato curry

హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం చిక్కుడుకాయ టమోటా కూర తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.

chikkudukaya tomato curry

కావలసిన పదార్థాలు:-

ఉప్పు

కారం

పసుపు చిటికెడు

ఎండు మిర్చి - 2

కొత్తిమీర

కరివేపాకు

ఆవాలు

పచ్చిమిర్చి

జీలకర్ర

చిక్కుడుకాయలు 

టమోటా 

ఉల్లిపాయలు

అల్లం వెల్లుల్లి పేస్ట్ 

దనియాల పొడి

ఎండు కొబ్బరి పొడి 

 

తయారు చేసే విధానం:-

 

  • చిక్కుడుకాయలు కడిగి ఈనలు తీసి ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి.

  • ఉల్లిపాయలు ,పచ్చిమిర్చి , టమోటా కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

  • ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని కొద్దిగా ఉప్పు ,పసుపు వేసుకొని చిక్కుడుకాయలు ఉడికించుకోవాలి.

  • స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె పోసి కాగిన తరువాత జీలకర్ర ,ఆవాలు,ఎండు మిర్చి,కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.

  • ఫ్రై ఐన తర్వాత పచ్చిమిర్చి ,ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ,పసుపు వేసుకోవాలి.

  • ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి మూత పెట్టి టొమాటోలు మగ్గించుకోవాలి.

  • టొమాటోలు మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.

  • ఐదు నిముషాలు ఫ్రై ఐన తర్వాత తగినంత ఉప్పు ,కారం,వేసి ఫ్రై చేసిన తర్వాత అందులో తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి.

  • నీళ్ళు దగ్గరపడే వరకు ఉడికించుకోవాలి.తర్వాత అందులో దనియాల పొడి, కొత్తిమీర,ఎండు కొబ్బరి పొడి వేసుకొని రెండు నిముషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

  • (అలాగే టమోటాలు బదులుగా ఆలుగడ్డ కూడా చిక్కుడు కాయలతో కలిపి వండుకోవచ్చు.

  • అంతే రుచికరమైన చిక్కుడుకాయ టమోటా కూర రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. షేర్ చెయ్యండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️