హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం బెండకాయ 65 తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.
కావలసిన పదార్థాలు:-
అల్లం- చిన్న ముక్క
పచ్చిమిర్చి-4
వెల్లుల్లి రెబ్బలు -6
బెండకాయలు - పావు కిలో
సెనగపిండి- 4 స్పూన్లు
బియ్యప్పిండి- 4 స్పూన్లు
జీలకర్ర పొడి- ఒక టీస్పూను
కారం
ఉప్పు - తగినంత
పల్లీలు-పావు కప్పు
గరం మసాలా - అరటీ స్పూను
ఎండు కొబ్బరి ఒక స్పూన్
నూనె సరిపడా
తయారు చేయు విధానం :-
కావలసిన పదార్థాలు అన్ని తయారు చేసి పెట్టుకోవాలి.
అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి మెత్తగా కాకుండా బరకగా చేయాలి.
బెండకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టి తడి పూర్తిగా పోయాక చిన్న చిన్న ముక్కలుగా తరగాలి.
ఒక ప్లేటులో బెండకాయ ముక్కలు, సెనగపిండి, బియ్యంపిండి, జీలకర్ర పొడి, కారం, కొద్దిగా నీళ్లు వేసి కలపాలి.
ఆ స్టా మీద బాణలిలో నూనె కాగాక పల్లీలు వేసి డీప్ ప్రై చేసి వక్కన ఉంచాలి
అదే నూనెలో కరివేపాకు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి.
అదే నూనె మరోసారి కాగాక బెండకాయ ముక్కలను పకోడీలుగా వేసి, మీడియం మంట మీద బాగా వేయించి దింపాలి.
ఫ్రై ఐన తర్వాత అన్ని ఒక గిన్నెలో వేసుకుని గరం మసాలా, వేయించి ఉంచిన పల్లీలు, ఎండు కొబ్బరి తురుము,కరివేపాకు ఒకదానితరవాత ఒకటి వేసి బాగా కలపాలి.
అంతే రుచికరమైన బెండకాయ 65 రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి.నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: కల్లుతో నాటు కోడి కూర / country chicken curry
Post a Comment
If you have any doubts, Please let me know.