బెండకాయ 65 / lady's finger 65

 హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం బెండకాయ 65 తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.

bendakaya fry

కావలసిన పదార్థాలు:-


అల్లం- చిన్న ముక్క

పచ్చిమిర్చి-4

వెల్లుల్లి రెబ్బలు -6

బెండకాయలు - పావు కిలో

సెనగపిండి- 4 స్పూన్లు

బియ్యప్పిండి- 4 స్పూన్లు

జీలకర్ర పొడి- ఒక టీస్పూను

కారం

ఉప్పు - తగినంత

పల్లీలు-పావు కప్పు

గరం మసాలా - అరటీ స్పూను

ఎండు కొబ్బరి ఒక స్పూన్

నూనె సరిపడా

 

తయారు చేయు విధానం :-

  • కావలసిన పదార్థాలు అన్ని తయారు చేసి పెట్టుకోవాలి.

  • అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి మెత్తగా కాకుండా బరకగా చేయాలి.

  • బెండకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టి తడి పూర్తిగా పోయాక చిన్న చిన్న ముక్కలుగా తరగాలి.

  • ఒక ప్లేటులో బెండకాయ ముక్కలు, సెనగపిండి, బియ్యంపిండి, జీలకర్ర పొడి, కారం, కొద్దిగా నీళ్లు వేసి కలపాలి.

  • ఆ స్టా మీద బాణలిలో నూనె కాగాక పల్లీలు వేసి డీప్ ప్రై చేసి వక్కన ఉంచాలి

  • అదే నూనెలో కరివేపాకు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి.

  • అదే నూనె మరోసారి కాగాక బెండకాయ ముక్కలను పకోడీలుగా వేసి, మీడియం మంట మీద బాగా వేయించి దింపాలి.

  • ఫ్రై ఐన తర్వాత అన్ని ఒక గిన్నెలో వేసుకుని గరం మసాలా, వేయించి ఉంచిన పల్లీలు, ఎండు కొబ్బరి తురుము,కరివేపాకు ఒకదానితరవాత ఒకటి వేసి బాగా కలపాలి.

  • అంతే రుచికరమైన బెండకాయ 65 రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి.నచ్చితే ఫాలో అవ్వండి.

Also read: కల్లుతో నాటు కోడి కూర / country chicken curry



0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️