ఆలూ పాలక్ గ్రేవీ కర్రీ / Aloo Palak gravy curry

హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం ఆలూ పాలక్ కర్రీ తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.

ఆలూ పాలక్ కర్రీ:-

మనం ఆలూ తో చాలా రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. అలాగే ఆలూ ను చాలా కూరగాయలతో పాటు కలిపి వండుకోవచ్చు. ఆలూ పాలక్ ఫ్రై ఎలా చేయాలో చూశాం. ఇప్పుడు గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం..

aloo palak gravy curry

కావలసిన పదార్థాలు:-

ఆలూ

పాలకూర

ఉల్లిపాయలు

కొత్తిమిర

గరం మసాల

ధనియాల పొడి

ఉప్పు

కారం

పసుపు

అల్లం వెల్లుల్లి పేస్ట్

నువ్వులు పావు కప్పు పేస్ట్

తయారు చేసే విధానం:-

  • ముందుగా ఆలు గడ్డ కడిగి ముక్కలు చేసి అందులో కొద్దిగా ఉప్పు తగినన్ని నీళ్లు పోసి ఉడకించుకోవాలి.

  • పాలకూర కడిగి వేడి నీళ్లలో వేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచి మిక్సి లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి.

  • ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ లో నూనె పోసి కాగాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.

  • ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఫ్రై చేయాలి.

  • రెండు నిమిషాల తర్వాత అందులో ఉడికించిన ఆలు, ఉప్పు, కారం తగినంత, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.

  • కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వుల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలపాలి.

  • దీన్ని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టీ ఉడికించాలి.

  • ఆ తర్వాత అందులో పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికంచి స్టౌ ఆఫ్ చేయాలి.

  • చివరగా కొత్తిమీర వేసుకోవాలి.

  • అంతే రుచికరమైన ఆలూ పాలక్ గ్రేవీ కర్రీ రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️