కల్లుతో నాటు కోడి కూర / country chicken curry

 హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం కల్లుతో నాటు కోడి కూర తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం.

నాటుకోడి కూర :-

 

నాటు కోడి కూర చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎముకలు గట్టిపడతాయి. దీన్ని ఎక్కువగా పల్లెటూరి లో  చేసుకుంటారు .ఎందుకంటే అక్కడే ఎక్కువగా కోళ్ళు పెంచుతుంటారు.చాలా మందికి ఇష్టం నాటు కోడి కూర అంటే .వెరైటీ గా కల్లుతో చేసుకుందాం. ట్రై చేయండి. 

country chicken curry

కావలసిన పదార్థాలు:-

నాటు కోడి

కల్లు ఒక గ్లాసు

నూనె

జీలకర్ర

కొత్తిమీర

అల్లం వెల్లుల్లి పేస్ట్

పసుపు

పచ్చి బఠాణీ

కారం

ఉల్లిపాయలు

ఉప్పు

ధనియాల పొడి

గరం మసాలా

తయారు చేసే విధానం:-

  • ముందుగా నాటు కోడి ని కట్ చేసి కడిగి పెట్టుకోవాలి.

  • ఇప్పుడు చికెన్ ను ఒక గిన్నలోకి తీసుకుని అందులో తగినంత కారం , అల్లం వెల్లుల్లి ముద్ద,కొద్దిగా పసుపు, ఒక గ్లాసు కల్లు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి కొద్ది సేపు అలాగే పక్కన పెట్టుకోవాలి.

  • ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ లో నూనె పోసి కాగిన తరువాత అందులో జీలకర్ర, పచ్చి మిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.

  • ఉల్లిపాయలు ఫ్రై ఐన తర్వాత అందులో చికెన్ ను వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టీ ఒక పావు గంట ఉడికించాలి.

  • తర్వాత అందులో ధనియాల పొడి, గరం మసాలా,కొత్తిమీర, సరిపడా ఉప్పు ఇంతకుముందు కొద్దిగా ఉప్పు వేశాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి.

  • ఒక ఐదు నిమిషాలు అలాగే ఉడికించి స్టౌ ఆఫ్ చేయాలి.

  • అంతే రుచికరమైన కల్లుతో నాటు కోడి కూర రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️