గోబీ పరాటా / gobi paratha

హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
మనం రకరకాలుగా పరాటాలు చేసుకుంటుంటాం.
ఈరోజు నోరూరించే వెరైటీ గోబీ పరాటా తయారు చేసే పద్దతి నేర్చుకుందాం.

గోబీ పరాటా:-

పరాటా అనేది ఎక్కువగా నార్త్ ఇండియా లో చేసుకునే వంటకం. ఇప్పుడు అందరూ అన్నీ రకాల వంటలు తయారు చేస్తున్నారు. అలాగే పరాటాలు చాలా రకాలు ఉంటాయి. ఆలూ, క్యాబేజ్…. ఇంకా చాలా.. ఈరోజు గోబీ పరాటా ఎలా చేయాలో చూద్దాం….

 

gobi paratha

కావలసిన పదార్థాలు:-

గోధుమపిండి రెండు కప్పులు

కాలీఫ్లవర్ తురుము ఒక కప్పు

కొత్తిమీర తురుము ఒక స్పూన్

పచ్చిమిర్చి రెండు

అల్లం చిన్న ముక్క

ఉప్పు

కారం

గరంమసాలా సగం స్పూన్

వాము అరటీస్పూను

నూనె లేదా నెయ్యి కాల్చడానికి సరిపడా

తయారు చేసే విధానం:-

  • పరాట చేసుకోవడానికి కాలీఫ్లవర్ నీ చిన్నగా తురుముకోవాలి.

  • గోధుమపిండిలో ఉప్పు, రెండు స్పూన్లు నూనె వేసి సరిపడా నీళ్లు పోసి చపాతీ పిండిలానే కలపాలి.

  • తురుముకున్న కాలీఫ్లవర్ తురుమును వేడినీళ్లలో వేసి ఒక రెండు నిమిషాల తర్వాత తీయాలి.

  • తీసిన కాలీఫ్లవర్ తురుము ఒక గిన్నెలో వేసుకుని అందులో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర తురుము, వాము, కారం, ఉప్పు, గరంమసాలా

  • అన్నీ వేసి బాగా కలపాలి.

  • కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని ముద్దలుగా చేసుకోవాలి.

  • ముందుగా రెండు చపాతీల్ని మీడియం సైజులో చేసుకోవాలి.

  • ఒక చపాతీమీద కాలీఫ్లవర్ ముక్కల మిశ్రమాన్ని సర్ది

  • దానిమీద మరో చపాతీని పెట్టి మళ్లీ కర్రతో ఒకే చపాతీలా

  • చేయాలి. 

  • ఇలాగే అన్నీ చేసుకుని నూనె లేదా వెన్నతో రెండువైపులా కాల్చి తీయాలి.

  • ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు.దానికోసం పిండి ముద్దను తీసుకొని అందులో కాలీఫ్లవర్ మిశ్రమం పెట్టుకొని మొత్తం ముసేయలి.

  • తర్వాత చపాతీ కర్రతో చపాతీలా చేసుకోవాలి. స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టీ వేడి చేసి రెండు వైపుల నునే లేదా నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి.

  • అంతే రుచికరమైన గోబీ పరాటా రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.


0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️