మిల్క్ కోవా / Milk kova

హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
మనం రకరకాలుగా స్వీట్ లు చేసుకుంటుంటాం.
ఈరోజు నోరూరించే వెరైటీ మిల్క్ కోవా తయారు చేసే పద్దతి నేర్చుకుందాం.

 

milk kova

కావలసిన పదార్థాలు :-

పాలు అర లీటరు

పంచదార పావు కప్పు

నిమ్మ రసం 1 టీ స్పూన్,

పిస్తా పప్పు

బాదం పప్పు కొద్దిగా

తయారు చేసే విధానం:-

  • మిల్క్ కోవా కావలసిన పదార్థాలు అన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి.

  • ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్రలో పాలు పోసి చిన్న మంట మీద మరిగించాలి.

  • కాసేపు తర్వాత నిమ్మరసాన్ని ఒక టేబుల్ స్పూన్ నీళ్లలో బాగా కలిపి మరుగుతున్న పాలలో చుక్క చుక్క చొప్పున వేస్తూ ఉండాలి. 

  • ఒకేసారి పోస్తే పాలు విరిగిపోతాయి. పాలు చిక్కబడే వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి.

  • పాలు చిక్కబడుతున్నప్పుడు అందులో పంచదార కలపాలి.

  • తర్వాత కూడా కోవాలా అయ్యే వరకు మరిగించాలి.

  • కోవాలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు

  • ఒకటి లేదా రెండు అంగుళాలు లోతున్న బౌల్ తీసుకుని, దాని లోపల నెయ్యి రాసి,బాదం పిస్తా పలుకులు చల్లాలి. 

  • దానిపై కోవా మిశ్రమాన్ని వేసుకుని, చల్లారిన తర్వాత

  • నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకోవాలి.

  • అంతే రుచికరమైన మిల్క్ కోవా స్వీట్ రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి. మరియు లైక్ చేయండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️