యాపిల్ మిల్క్ షేక్ / Apple Milk Shake

 హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.


మనం చాలా రకాల మిల్క్ షేక్ లు రెడీ చేసుకుంటూ ఉంటాం .బననా మిల్క్ షేక్ లు చేసుకుంటాము. కాని ఈరోజు యాపిల్ తో వెరైటీగా యాపిల్ మిల్క్ షేక్ తయారు చేసుకుందాం.చాలా రుచిగా ఉంటుంది. పండ్లు తినని పిల్లలకు మిల్క్ షేక్ లా ఇస్తే చాలా ఇష్టపడతారు ..తప్పకుండా ప్రయత్నించండి....


apple milk shake


కావలసిన పదార్థాలు:-

ఆపిల్స్ రెండు

కర్జూరం ముక్కలు: 5-6

లేదా 

చెక్కర సగం కప్పు 

యాలకుల పొడి: పావు టీస్పూన్

ఐస్ ముక్కలు  2 లేదా 3

పాలు అరలీటరు 

పిస్తా పౌడర్: ఒక టేబుల్ స్పూన్


తయారు చేసే విధానం:-

  • ముందుగా ఆపిల్స్ కడిగి చెక్కు తీసి ముక్కలు గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి .
  • కర్జూరం ని ముందుగా పాలలో నానపెట్టుకోవాలి.కర్జూరం తినడం నచ్చని వాళ్ళు చెక్కర రుచికి తగినట్టు వేసుకోవాలి.
  • అర లీటర్  పాలు తీసుకోని అందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని మరిగించాలి.మరిగిన తర్వాత చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు  మిక్సీ జార్ లో యాపిల్ ముక్కలు, కర్జూరం, ఐస్ క్యూబ్స్, పాలు పోసి బాగా మిక్స్  చేయాలి. 
  • ఆపిల్స్ మొత్తం మెత్తగా అయ్యే వరకు మిక్సి పట్టుకోవాలి.తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసి మిక్సీ పట్టాలి. తర్వాత సర్వింగ్ గ్లాసులో పోసి పిస్తా పౌడర్ తో గార్నిష్ చేస్తే యమ్మీ యమ్మీ యాపిల్ మిల్క్ షేక్ రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.


Also read: చింతకాయ రైస్ / chinthakaya rice


0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️