హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
మనం చాలా రకాల కాంబినేషన్ లో కూరలు చేసుకుంటూ ఉంటాం .ఆకుకూరలు కూరగాయలు కలిపి చాల రకాల వంటలు చేస్తాము. కాలిఫ్లవర్ ,పనీర్ ,వంకాయ ఆలుగడ్డ ఇలా చాల చేసుకుంటాము. కాని ఈరోజు దోసకాయ తో వెరైటీగా మెంతి కుర తయారు చేసుకుందాం.చాలా రుచిగా ఉంటుంది.ఇ లా ఇస్తే చాలా ఇష్టపడతారు ..తప్పకుండా ప్రయత్నించండి....
కావలసిన పదార్థాలు:-
మెంతికూర రెండు కట్టలు
ఉల్లిగడ్డ రెండు
దోసకాయ- అరకిలో
పచ్చి కొబ్బరి - పావుకప్పు
కారం తగినంత
ఉప్పు- కొద్దిగా
పచ్చిమిర్చి రెండు
నూనె-సరిపడా
తాలింపు గింజలు- రెండు టీ స్పూన్లు
పసుపు-కొద్దిగా
వెల్లుల్లి ఒక నాలుగు
దనియాల పొడి
ఒక టమాటో
తయారు చేసే విధానం:-
- ముందుగా మెంతి కుర కడిగి ఆకులూ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి.
- అలాగే దోసకాయ,టమాటో,ఉల్లిపాయ,పచ్చి మిర్చి కట్ చేసి పెట్టుకోవాలి.వెల్లుల్లి నలగొట్టి పెట్టుకోవాలి.
- కడాయిలో నూనె వేడి చేసి పోపు గింజల్ని,వెల్లుల్లి వేసి వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు వేయాలి.
- ఉల్లిగడ్డ కాస్త రంగుమారగానే మెంతికూర వేసి ఫ్రై చేసుకోవాలి.తర్వాత టమాటో ముక్కలు వేసి మగ్గించాలి.
- ఇప్పుడు దోసకాయ ముక్కలు, పసుపు,ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి.ముక్కలు బాగా మగ్గి, నీరంతా పోయాక కొబ్బరి తురుము, కారం కలిపితే కాసేపు కరం ఉడికే వరకు ఉడికించుకోవాలి.చివరగా దనియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.అంతే టేస్టీ టేస్టీ మెంతికూర, దోసకాయ కూర రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.
Also read: చికెన్ పాప్ కార్న్ / Chicken Pop Corn
Post a Comment
If you have any doubts, Please let me know.