హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
మనం రకరకాలుగా అమ్లేట్ లు చేసుకుంటుంటాం..ఈరోజు నోరూరించే ఎగ్ లేకుండా బ్రేడ్ తో అమ్లేట్ తయారు చేసే పద్దతి నేర్చుకుందాం...ఎగ్ తినని వాళ్ళకు ఇది చాలా చక్కని రెసిపి.తప్పకుండ ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు:-
బ్రేడ్ (బ్రౌన్ బ్రెడ్ )బేసిన్(శెనగ పిండి)
నూనె
జీలకర్ర
ఉప్పు
కారం
పసుపు
తురిమిన క్యారట్
ఉల్లిపాయలు
టమాట ఒకటి
కరేపకు
తరిగిన పచ్చిమిర్చి
నీరు
తయారు చేసే విధానం:-
- ముందుగా బ్రేడ్ చివరలు తీసేసి పెట్టుకోవాలి.
- తర్వాత ఒక గిన్నెలో శెనగపిండి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, తురిమిన క్యారట్, తురిమిన ఉల్లిపాయలు, టమాట ముక్కలు, కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలపాలి.
- ఆ తర్వాత పెనం స్టౌవ్ మీద పెట్టి వేడి చేయాలి. వేడి అయ్యాక పెనం పై కొద్దిగా నూనె పోసి దానిపై మనం తయారు చేసిన మిశ్రమాన్ని గరిట తో పోసి దానిపై బ్రేడ్ నీ పెట్టాలి.
- పై నుండి కొంచెం నూనె వేయాలి. రెండు నిమిషాల తర్వాత పెనం పై ఆమ్లెట్ రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి. అంతే ఎగ్ లేకుండా బ్రేడ్ ఆమ్లెట్ రెడీ. దీన్ని సాస్ తో తీసుకుంటే చాల రుచిగా ఉంటుంది.
- నేను తయారుచేసాను.మీరు ప్రయత్నించండి. సూపర్ ఆమ్లెట్ ఎగ్ తినని వాళ్లకు చాలా మంచి ఆమ్లెట్.
- తప్పకుండా ప్రయత్నించండి.మరియు లైక్ చేయండి.మీకు నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: వంకాయ ఖీమా / brinjal mutton kheema
Post a Comment
If you have any doubts, Please let me know.