హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
రొటీన్ గా మనం అన్ని రకాల వెరైటి వంటలు చేసుకుంటాము. కాని ఈరోజు మనం కొన్ని వంటింటి చిట్కాలు నేర్చుకుందాం... ఎక్కువ ఇంట్లో ఉండే ఆడవాళ్లకు చాల ఉపయోగపడతాయి . వాటితో మన వంటలను మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు.... తప్పకుండా ప్రయత్నించండి....
వంటింటి చిట్కాలు:-
- ఇడ్లీ పిండి పుల్లగా అవ్వకుండా ఉండాలంటే చిన్న అరటి ఆకును అందులో వేసి ఉంచితే సరిపోతుంది.
- ముందుగా ఉప్పు వేసిన కూడా పిండి తొందరగా పుల్లగా అవుతుంది.కాబట్టి ఇడ్లి చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటే మంచిది.
- చపాతీలు పూరీల్లా పొంగాలంటే గోధుమపిండిలో కొంచెం పెరుగు లేదా మజ్జిగ,కొద్దిగా నూనె కలిపితే చాలు.చాల సాఫ్ట్ గా పొంగుతాయి.
- చికెన్ ఉడికించేటప్పుడు ఒక కోడిగుడ్డును చేర్చితే రుచిగా ఉంటుంది.
- కూర వండుకునేటపుడు తాళింపు చేసేటప్పుడు అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ ఉంటే కూర పోపు మాడదు.
- కూరగాయలను ఉడికించేటప్పుడు పాత్రను మూసి ఉంచితే పోషకాలు వేరు కాకుండా త్వరగా ఉడుకుతాయి.
- కూరగాయలు, పండ్లు ,ఉడికించిన ఆహారాన్ని ఒకరోజు మాత్రమే ఫ్రిజ్లో ఉంచాలి.
- చపాతీ పిండిలో అరటిపండు గుజ్జు కలుపడం వల్ల మెత్తగా ఉండడమే కాకుండా చాలాసేపు గట్టిపడకుండా ఉంటాయి.
- చపాతీపిండిలో కొంచెం శనగపిండి కలిపితే మంచి రంగు,వాసన వస్తాయి.
- దోసల పిండిలో కొద్దిగా ఉప్మా రవ్వ నానపెట్టి రుబ్బి కలిపితే దోసలు ఎర్రగా వస్తాయి.
తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.
Also read: బ్యూటీ టిప్స్ / Beauty Tips
Post a Comment
If you have any doubts, Please let me know.