హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు వెరైటీగా బెండకాయ మసాలా కర్రీ తయారు చేసుకుందాం.
కావలసిన పదార్థాలు:-
బెండకాయ
నూనె
జీలకర్ర
పెరుగు
ఉప్పు
కారం
ధనియాలపొడి
కొత్తిమీర
ఎండుమిర్చి
కరివేపాకు
నీళ్లు
టమాటా ముక్కలు
ఉల్లిపాయ ముక్కలు
అల్లం వెల్లుల్లి పేస్ట్
పసుపు
తయారు చేసే విధానం:-
- బెండకాయలు ,ఉల్లిపాయలు, టమాటాలు అన్ని కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడి అయిన తర్వాత అందులో జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ,కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకోవాలి.
- ఇప్పుడు అందులో టమాటా ముక్కలు వేసి మగ్గించాలి
- టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులో బెండకాయ ముక్కలు వేసి పది నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
- తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కలపాలి
- ఇప్పుడు తగినంత కారం, ఉప్పు,ధనియాల పొడి వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
- ఫ్రై అయిన తర్వాత అందులో ఒక కప్పు పెరుగు వేసి కలపాలి బాగా కలిపిన తరువాత కావలసిన అన్ని నీళ్ళు పోసుకోవాలి .
- నూనె పైకి తేలే వరకు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.