హాయ్ ఫ్రెండ్స్ ,
ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మొలకలతో స్నాక్స్ తయారు చేసుకుందాం.
కావలసిన పదార్థాలు:-
పెసలు
కందులు
బొబ్బర్లు
పచ్చి మిర్చి
ఉప్పు
పసుపు
అల్లం ముక్కలు
ఉల్లిపాయ ముక్కలు
కరివేపాకు
నూనె
కొత్తిమీర
తయారు చేసే విధానం :-
- పెసలు కందులు బొబ్బర్లు అన్నింటినీ కడిగి ఒక రోజు నానబెట్టుకోవాలి.మరుసటి రోజు వాటిని కడిగి అందులో నీళ్ళు అన్నీ తీసేసి ఒక తడి బట్టలో కట్టి పెడితే మరుసటి రోజుకు మొలకలు వస్తాయి .మరీ ఎక్కువ మొలకలు రావాలంటే రెండు రోజులు తడిబట్టలో పెట్టుకోవాలి.
- ఇప్పుడు మొలకలు అన్నింటిని మిక్సీ జార్లో తీసుకొని అందులో అల్లం ,పచ్చిమిర్చి ,కరివేపాకు ,ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి.
- మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో పసుపు కొత్తిమీర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో నూనె పెట్టుకోవాలి.
- నూనె వేడి అయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చేతితో ఒత్తుకొని నూనెలో వేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
- ఈ గారెలకు చెట్ని లేకపోయినా పరవాలేదు కావాలి అనుకుంటే స్వీట్ చట్నీతో తినవచ్చు.
- అంతే రుచికరమైన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మొలకల గారెలు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.