బెల్లం సెనగపప్పు పూర్ణాలు

హాయ్ ప్రెండ్స్,
ఈరోజు బెల్లం సెనగపప్పు తో పూర్ణాలు చేసుకుందాం.


కావలసిన పదార్థాలు:-

బెల్లం ఒక కప్పు
సెనగపప్పు ఒక కప్పు
మినపప్పు సగం కప్పు
బియ్యం ఒక కప్పు
నూనె
ఈలచి పొడి

తయారు చేసే విధానం:-

  • బియ్యం ఒక కప్పు, మినపప్పు సగం కప్పు ఒక ఆరు గంటల వరకు నానపెట్టాలి.
  • ఇప్పుడు బియ్యం,మినపప్పు రెండింటిని మెత్తగా రుబ్బుకోవాలి.
  • నీళ్ళు తక్కువ పోసుకొని పిండిని గట్టిగా రుబ్బుకోవాలి.
  • ఇప్పుడు సెనగపప్పు కుక్కర్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు బెళ్ళంను తురిమి సెనగపప్పు, ఇలాచి పౌడర్ ను కలిపి మెత్తగా ముద్దలా చేసుకోవాలి.
  • తర్వాత స్టౌ వెలిగించి కళాయి లో నూనె పోసి వేడిచేయాలి.
  • తర్వాత సెనగపప్పు బెల్లం మిశ్రమం ను చిన్న చిన్న ఉండలుగా చేసి బియ్యం మినపప్పు మిశ్రమం లో ముంచి నూనెలో వేసి ఎర్రగా కాల్చుకోవాలి.
  • అంతే రుచికరమైన స్వీట్ బెల్లం పూర్ణాలు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️