హాయ్ ప్రెండ్స్,
ఈరోజు చపాతీ, రోటీ, పూరిలోకి ఎంతో రుచికరమైన రాజ్మా మసాలా తయారు చేసుకుందాం.
కావలసిన పదార్థాలు:-
రాజ్మా
నూనె
జీలకర్ర
ఎండుమిర్చి
కరివేపాకు
కొత్తిమీర
ధనియాల పొడి
గరం మసాలా
ఉప్పు
కారం
అల్లం వెల్లుల్లి పేస్ట్
పసుపు చిటికెడు
ఉల్లిపాయ ముక్కలు
టొమాటో గుజ్జు
బిర్యానీ ఆకు
తయారు చేసే విధానం:-
- ముందు రోజు రాత్రి రాజ్మా ని నానపెట్టి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కుక్కర్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర,ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి.
- తర్వాత ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టొమాటో పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
- ఫ్రై అయిన తర్వాత అందులో రాజ్మా, తగినంత ఉప్పు, కారం , నీళ్లు తగినన్ని వేసి కుక్కర్ మూత పెట్టీ పది విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
- పది విజిల్స్ తర్వాత మూత తీసి అందులో ధనియాల పొడి,గరం మసాలా, కొత్తిమీర వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి.
- అందులో కొన్ని రాజ్మా గింజలను మెత్తగా మెదపాలి.
- అంతే రుచికరమైన రాజ్మా మసాలా కర్రీ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.