హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా ఆలూ బ్రెడ్ రోల్ ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్ధాలు:-
ఉడికించిన ఆలూ ముక్కలు
పసుపు చిటికెడు
ఉప్పు తగినంత
కారం తగినంత
శెనగ పిండి
బ్రెడ్
బ్రెడ్ పొడి
నూనె
ధనియాల పొడి
కొత్తిమీర
చాట్ మసాలా
తయారు చేసే విధానం:-
- ఒక గిన్నె తీసుకొని అందులో ఉడికించిన ఆలూ ముక్కలు,కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ధనియాలపొడి, కొత్తిమీర, చాట్ మసాలా వేసి ముద్ద గా కలిపి పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి కొద్దిగా శెనగ పిండి తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి, చిటికెడు ఉప్పు వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి.
- బ్రెడ్ తీసుకొని చివరలు కట్ చేసి పెట్టుకోవాలి.
- కట్ చేసి పెట్టుకొన్న చివరలను మిక్సి లో వేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఇప్పుడు ఆలూ నీ చిన్న చిన్న ఫింగర్స్ చేసుకోవాలి.
- ఒక్కో ఫింగర్ నీ తీసుకొని బ్రెడ్ లో పెట్టీ రోల్ చేసి శెనగ పిండి లో ముంచి బ్రెడ్ పొడిలో మంచిగా దొర్లించి నూనెలో వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి.
- అంతే రుచికరమైన ఆలూ బ్రెడ్ రోల్ రెడీ.
Also read: పల్లీ కారం పొడి దోశ
Post a Comment
If you have any doubts, Please let me know.