సేమియా పాయసం

హాయ్ ఫ్రెండ్స్,

ఈరోజు మనం టేస్టీ గా సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం.

vermicelli milk pudding

కావలసిన పదార్ధాలు:-

సేమియా పావు కిలో
చెక్కర ఒక కప్పు
పాలు అర లీటరు
నెయ్యి / నూనె
బాదం పప్పులు
కిస్మిస్ 
జీడిపప్పు పలుకులు
పచ్చి కొబ్బరి ముక్కలు

తయారు చేసే విధానం:-

  • స్టౌ వెలిగించి కళాయి లో నెయ్యి వేసి సేమియా ని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి.
  • అలాగే డ్రై ఫ్రూట్ అన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ మీద గిన్నె పెట్టీ అందులో పాలు పోసి బాగా మరిగించాలి.
  • ఇప్పుడు మరుగుతున్న పాలలో సేమియా వేసి ఒక పది నిమిషాలు ఉడికించాలి.
  • తర్వాత అందులో చెక్కర వేసి బాగా కలపాలి.
  • మరొక పది నిమిషాలు మరిగించాలి. చివరగా డ్రై ఫ్రూట్ అన్ని వేసి కలిపి దింపేయాలి.
  • అంతే రుచికరమైన సేమియా పాయసం రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️