పప్పు పాలకూర రైస్ (బేబీ ఫుడ్)

హాయ్ ఫ్రెండ్స్,

ఈరోజు మనం టేస్టీ గా పప్పు పాలకూర రైస్ఎలా చేయాలో చూద్దాం.

palak rice

కావలసిన పదార్ధాలు:-

పాలకూర  కప్పు
బియ్యం సగం కప్పు
జీలకర్ర
పచ్చి మిర్చి ఒకటి
వెల్లుల్లి ఒకటి
పసుపు చిటికెడు
ఉప్పు చిటికెడు
నీళ్లు
పప్పు ఏదైనా రెండు స్పూన్లు
నూనె /నెయ్యి

తయారు చేసే విధానం:-

  • స్టౌ వెలిగించి కుక్కర్ పెట్టీ వేడయ్యాక అందులో ఒక స్పూన్ నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చి మిర్చి, వెల్లుల్లి, కడిగిన బియ్యం, పప్పు,పాలకూర, పసుపు ,ఉప్పు , రెండు కప్పుల నీళ్లు పోయాలి.
  • కుక్కర్ మూత పెట్టి 5విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
  • ఉడికిన తర్వాత మెత్తగా మెదిపి తినిపించాలి.
  • అంతే రుచికరమైన పప్పు పాలకూర రైస్ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️