మెంతికూర టమాటా

హాయ్ ఫ్రెండ్స్,

ఈరోజు మనం టేస్టీ గా మెంతికూర టొమాటో ఎలా చేయాలో చూద్దాం.

methi tomato curry

కావలసిన పదార్ధాలు:-

మెంతికూర
టొమాటో
ఉల్లిపాయ ముక్కలు
నూనె
జీలకర్ర
ఎండుమిర్చి
కరివేపాకు
కొత్తిమీర
వెల్లుల్లి ముక్కలు
కారం
ఉప్పు

తయారు చేసే విధానం:-

  • మెంతికూర,టొమాటో, ఉల్లిపాయలు కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
  • స్టౌ వెలిగించి కళాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర,ఎండు మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఫ్రై ఐన తర్వాత అందులో పసుపు వేసి కలపాలి.
  • ఇప్పుడు కట్ చేసి పెట్టుకొన్న మెంతి కూర వేసి ఫ్రై చేసుకోవాలి.
  • మగ్గిన తరువాత అందులో కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  • చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.
  • అంతే రుచికరమైన టొమాటో మెంతి కూర రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️