హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా మూంగ్ దాల్ రైస్ ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్ధాలు:-
బియ్యం సగం కప్పు
పెసలు సగం కప్పు
పసుపు చిటికెడు
ఉప్పు రుచికి తగినంత
నెయ్యి / నెయ్యి
క్యారట్ ముక్కలు
పచ్చిమిర్చి ఒకటి
అల్లం చిన్న ముక్క
తయారు చేసే విధానం:-
- స్టౌ వెలిగించి కుక్కర్ లో నూనె వేసి వేడయ్యాక అందులో బియ్యం, నానపెట్టి న పెసలు, పసుపు చిటికెడు, ఉప్పు చిటికెడు, క్యారట్ ముక్కలు, పచ్చి మిర్చి,అల్లం వేసి ఒక నిమిషం ఫ్రై చేయాలి.
- ఇప్పుడు మూడు కప్పుల నీళ్ళు పోసి బాగా కలపాలి.
- కుక్కర్ మూత పెట్టీ ఒక ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
- ఉడికిన తర్వాత స్పూన్ తో కానీ గరిటతో బాగా మెదిపి తినిపించాలి.
- అంతే రుచికరమైన హెల్తీ ముంగ్ దాల్ రైస్ రెడీ.
Also read: మెంతికూర టమాటా
Post a Comment
If you have any doubts, Please let me know.