చేపల వేపుడు (క్రిస్పి ఫిష్ ఫ్రై)

హాయ్ ఫ్రెండ్స్,

ఈరోజు మనం టేస్టీ గా క్రిస్పి ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.

Fish fry

కావలసిన పదార్థాలు:-

చేప - పావు కేజీ
కరివేపాకు - కొద్దిగా
నూనె సరిపడా
అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - తగినంత
నిమ్మకాయ - ఒకటి
కారం తగినంత
గరంమసాలా - అర టీస్పూన్
ఉప్పు రుచికి తగినంత

తయారు చేసే విధానం:-

  • ముందుగా చేపను శుభ్రం చేసుకోవాలి. ఒక బౌల్ లో అల్లంవెల్లుల్లి
  • పేస్టు, పసుపు, గరంమసాలా, కారం, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు పట్టించాలి. 
  • స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసికరివేపాకు వేసి వేయించాలి.
  • తరువాత మసాలా పట్టించిన చేప ముక్కలు వేసి చిన్నమంటపై కాసేపు వేగనివ్వాలి.
  • కాసేపయ్యాక నెమ్మదిగా చేప ముక్కలు మరో వైపు తిప్పి మరికాసేపు ఫ్రై కానివ్వాలి.
  • చేప ముక్కలు రెండు వైపులా బాగా ఫ్రై అయ్యాక నిమ్మరసం పిండుకొని దించాలి.
  • అంతే రుచికరమైన చేపల వేపుడు రెడీ.
  • చపాతీలోకి లేదా అన్నంలోకి రుచిగా ఉంటుంది.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️