క్రిస్పి సగ్గుబియ్యం ఆలూ వడలు

హాయ్ ఫ్రెండ్స్,

ఈరోజు మనం టేస్టీ గా క్రిస్పి సగ్గుబియ్యం ఆలూ వడలు ఎలా చేయాలో చూద్దాం.

crispy sabudana potato vada

కావాల్సిన పదార్థాలు:-

సగ్గుబియ్యం - కప్పు
ఉడికించిన ఆలూ రెండు
సెనగపప్పు- కప్పు
జీలకర్ర- టీస్పూను
పసుపు
కరివేపాకు కొద్దిగా
తరిగిన పచ్చిమిర్చి- రెండు
కారం- ఒక స్పూన్
ఉప్పు- తగినంత
అల్లం తరుగు కొద్దిగా
నూనె
కొత్తిమీర

తయారు చేసే విధానం:-

  • సగ్గుబియ్యాన్ని మూడుగంటలపాటు నానబెట్టుకోవాలి.
  • బంగాళాదుంపలు ఉడికించి, పొట్టు తీసి మెత్తగా చేసి పెట్టుకోవాలి.
  • సెనగపప్పును నాలుగు గంటల పాటు నానపెట్టి బరకగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
  • గిన్నెలో సగ్గుబియ్యం, ఉడికించిన ఆలూ ముద్ద, సెనగపప్పు ముద్ద, జీలకర్ర,కరివేపాకు, అల్లం తరుగు, కొత్తిమీర,పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి.
  • పిండిని వడలు చేయడానికి కావలసినట్టు గా కలిపి పెట్టుకోవాలి.
  • ( కావాలనుకుంటే పచ్చి మిర్చి పేస్ట్ చేసి వేసుకోవచ్చు.)
  •  ఇప్పుడు డిప్ ఫ్రై చేయడానికి కడాయిలో నూనె పోసి వేడి చేయాలి.
  •  సగ్గుబియ్యం మిశ్రమం కొద్ది కొద్దిగా తీసుకొని అర చేతిలో వేసుకొని వడలు మనకు కావలసిన విధంగా చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
  • వడలను రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు మంట తక్కువ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి.
  • అంతే రుచికరమైన సగ్గు బియ్యం వడలు రెడీ.
  • ఈ వడలకు టమాటా సాస్ లేదా కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటాయి.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️