హాయ్ ఫ్రెండ్స్,ఈరోజు మనం గుంట పొంగనాలు తయారు చేసుకుందాం.
కావలసిన పదార్థాలు:-
బియ్యం
మినప్పప్పు
మెంతులు
నూనె
నీళ్ళు
ఉప్పు
తయారు చేసే విధానం:-
- బియ్యం, మినపప్పు, మెంతులు కడిగి ఆరు గంటల పాటు నానపెట్టి పెట్టుకోవాలి.
- ఆరు గంటల తర్వాత మిక్సి లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- దోశ పిండి లా కలుపుకోవాలి.
- తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి నాలుగు గంటలు పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి గుంట పొంగనాలు చేయడానికి గుంట పొంగనాల గిన్నె పెట్టీ వేడి చేసుకోవాలి.
- కొద్దిగా నూనె వేసి పిండి గరిటతో కొద్ది కొద్దిగా వేసి పై నుండి నూనె వేసి మూత పెట్టీ రెండు నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి.
- ఎర్రగా కాల్చుకోవాలి.
- దీనికి టొమాటో చట్నీ చాలా బాగుంటుంది.
- అంతే రుచికరమైన గుంట పొంగనాలు రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.