హాయ్ ప్రెండ్స్,
ఈరోజు టొమాటో మసాలా గ్రేవీ చేసుకుందాం.
కావలసిన పదార్థాలు:-
టొమాటోలు అరు మీడియం సైజ్
ఉల్లిపాయలు రెండు
నూనె ఐదు స్పూన్లు
జీలకర్ర సగం చెంచా
ఎండు మిరపకాయలు రెండు
కరివేపాకు
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్
పసుపు సగం చెంచా
కారం రెండు స్పూన్లు
కొత్తిమీర ఒక కట్ట
ధనియాల పొడి ఒక స్పూన్
గరం మసాలా
ఉప్పు
ఎండు కొబ్బరి పొడి రెండు స్పూన్లు
పల్లీలు సగం కప్పు
నువ్వులు రెండు స్పూన్లు
బిర్యానీ ఆకు
తయారు చేసే విధానం:-
- ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి.
- తర్వాత ఎండుకొబ్బరి,పల్లీలు, నువ్వులు ఫ్రై చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు ,జీలకర్ర,ఎండు మిర్చి ముక్కలు, కరేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి.
- తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి.
- ఇప్పుడు టొమాటోలు కట్ చేయకుండా అలాగే వేసి చిన్న మంట మీద టొమాటోలు మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
- టొమాటోలు ఫ్రై ఐన తర్వాత అందులో తగినంత ఉప్పు కారం వేసి కలిపి తయారు చేసి పెట్టుకొన్న పేస్ట్ వేసి బాగా కలిపి రెండు నిమషాలు ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకొని బాగా మగ్గించాలి.
- తర్వాత ధనియాల పొడి, గరం మసాలా,వేసుకోవాలి.
- నూనె పైకి తేలే వరకు చిన్న మంట మీద ఉడికించాలి.
- చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.
- అంతే రుచికరమైన వంటకం టొమాటో మసాలా కర్రీ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.