హాయ్ ప్రెండ్స్,
ఈరోజు పీనట్ (పల్లీలు)పొటాటో రైస్ చేసుకుందాం.
కావలసిన పదార్థాలు:-
పల్లీలు
ఉడికించిన అన్నం
ఆలూ గడ్డ
నూనె
జీలకర్ర
ఆవాలు
మినపప్పు
చిటికెడు పసుపు
ఉప్పు
పచ్చి మిర్చి ముక్కలు
ఉల్లిపాయ ముక్కలు
ఎండు మిర్చి ముక్కలు
అల్లం తరుగు
కరేపాకు
కొత్తిమీర
మిరియాల పొడి
తయారు చేసే విధానం:-
స్టౌ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు,ఎండుమిర్చి,పచ్చిమిర్చి,కరివేపాకు ,అల్లం తరుగు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొన్న ఆలూ ముక్కలు వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
మరొక పాన్ లో నూనె వేసి పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఆలూ ఫ్రై ఐన తర్వాత అందులో తగినంత ఉప్పు వేసి కలిపి ఉడికించిన అన్నం వేసి బాగా కలపాలి.
ఒక నిమిషం తర్వాత మిరియాల పొడిని వేసి కలిపి మూత పెట్టుకోవాలి.
ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు, కొత్తిమిర వేసి కలిపి దించేయాలి.
అంతే రుచికరమైన పీనట్ పొటాటో రైస్ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.