హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు వెరైటీ గా హోటల్ స్టైల్ క్రిస్పీ దోస తయారు చేసుకుందాం.
కావలసిన పదార్థాలు:-
బియ్యం రెండు కప్పులు
మినప్పప్పు ఒక కప్పు
ఉప్మా రవ్వ సగం కప్పు
శనగపప్పు రెండు స్పూన్లు
మెంతులు సగం స్పూన్
కావాలనుకునేవారు అటుకులు,సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు.
తయారు చేసే విధానం:-
- బియ్యం ,మినప్పప్పు , శెనగ పప్పు, మెంతులు బాగా కడిగి ఆరు గంటలు నానబెట్టుకోవాలి.
- ఉప్మా రవ్వ కూడా నానపెట్టుకోవాలి.
- బియ్యం ,మినప్పప్పు ,శనగపప్పు, మెంతులు ఇవన్నీ నానిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- ఉప్మా రవ్వ ను కూడా మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది.
- ఇప్పుడు అన్ని ఒక గిన్నెలో తీసుకొని బాగా కలిపి మూతపెట్టి కనీసం నాలుగు గంటలు పక్కన పెట్టుకోవాలి.
- నాలుగు గంటల తర్వాత దోసెలు వేసుకునేటప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకొని నాన్ స్టిక్ పాన్ పైన దోసెలు వేసుకుని ఎర్రగా కాల్చుకోవాలి.
- పల్లి చట్నీ గాని టమోటో చట్నీ గాని చాలా బాగుంటుంది.
- అంతే హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు రెడీ.
- తప్పకుండా ప్రయత్నించండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఫాలో అవ్వండి
Post a Comment
If you have any doubts, Please let me know.