హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు వెరైటీ గా బీరకాయ పెసరపప్పు ఫ్రై తయారు చేసుకుందాం.
కావలసిన పదార్ధాలు:-
బీరకాయ ముక్కలు
పెసరపప్పు
ఉల్లిపాయలు
టమాటాలు
పచ్చిమిర్చి
అల్లం వెల్లుల్లి పేస్ట్
పసుపు
ఉప్పు
కారం
నూనె
జీలకర్ర
ఆవాలు
ఎండుమిర్చి
వెల్లుల్లిపాయలు
కరివేపాకు
కొత్తిమీర
తయారు చేసే విధానం:-
- ముందుగా రెండు పెద్ద స్పూన్లు తీసుకుని నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో పోపు కి నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
- ఉల్లిపాయ ముక్కలు అయిన తరువాత టమాటాలు వేసి కొద్దిగా ఉప్పు వేసి టమాటాలు ఉడికించుకోవాలి.
- టమాటాలు ఉడికిన తర్వాత అందులో బీరకాయ ముక్కలు వేసుకొని ఒక 15 నిమిషాలు మగ్గించాలి.
- బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ,పసుపు వేసి కలపాలి.
- బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాత అందులో తగినంత ఉప్పు కారం వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు ఎప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
- మొత్తం డ్రైవింగ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చివరగా కొత్తిమీర వేసుకోవాలి.
- అంతే రుచికరమైన బీరకాయ పెసరపప్పు ఫ్రై రెడీ.
Post a Comment
If you have any doubts, Please let me know.