వెజిటబుల్ ఇడ్లీ

హాయ్ ప్రెండ్స్,
ఈరోజు మనం వెజిటబుల్ ఇడ్లీ తయారు చేసుకుందాం.

కావలసిన పదార్థాలు:-

ఇడ్లీ రవ్వ
మినపప్పు
ఉప్పు
క్యారట్ తురుము
ఆనియన్ ముక్కలు
కొత్తిమీర
పచ్చి మిర్చి ముక్కలు

తయారు చేసే విధానం:-

  • ఇడ్లీ రవ్వ నానపెట్టి పక్కన పెట్టుకోవాలి.
  • మినపప్పు అరు గంటలు నానపెట్టి పక్కన పెట్టుకోవాలి.
  • ఆరు గంటల తర్వాత మినపప్పు రుబ్బి నానపెట్టి న ఇడ్లీ రవ్వ లో వేసి బాగా కలపాలి.
  • ఇడ్లీ పిండి అరు గంటలు నానపెట్టి పెట్టుకోవాలి.
  • లేదా రాత్రి పూట చేసుకొని పొద్దున చేసుకోవచ్చు.
  • ఇప్పుడు ఉప్పు, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారట్ తురుము అన్ని ఇడ్లీ పిండి లో కావలసినంత కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో నీళ్ళు పోసి వేడి చేసుకోవాలి.
  • ఇడ్లీ ప్లేట్లో నూనె కొద్దిగా రాసుకొని ఇడ్లీ పిండి వేసుకొని కుక్కర్ లో పెట్టీ ఉడికించుకోవాలి.
  • పల్లీ చట్నీ చేసుకొని తింటే అదిరిపోతుంది.
  • అంతే రుచికరమైన వెజిటబుల్ ఇడ్లీ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️