హాయ్ ప్రెండ్స్,
ఈరోజు మనం రవ్వ కేసరి తయారు చేసుకుందాం.
కావలసిన పదార్థాలు:-
ఉప్మా రవ్వ రెండు కప్పులు
చెక్కర ఒక కప్పు
పాలు అర లీటరు
నీళ్లు అర లీటరు
నెయ్యి
ఇలాచి పౌడర్
బాదం
కిస్మిస్
జీడిపప్పు
పిస్తా
ఆరంజ్ ఫుడ్ కలర్
తయారు చేసే విధానం:-
- ముందుగా స్టౌ వెలిగించి పాన్ పెట్టీ కొద్దిగా నెయ్యి వేసి రవ్వ ను ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ మీద గిన్నె లో అర లీటర్ పాలు పోసి బాగా వేడి చేసుకోవాలి.
- ఇప్పుడు ఇంకో స్టౌ మీద బాణలి లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్ వేయించి పక్కన పెట్టుకోవాలి.
- పాలు బాగా మరిగిన తర్వాత అందులో చెక్కర వేసి బాగా కలపాలి.
- చెక్కర కరిగిన తరువాత అందులో ఫ్రై చేసిన రవ్వను వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
- పది నిమిషాలు ఉడికించాలి. ఇలాచి పౌడర్ వేసుకోవాలి.
- తర్వాత అందులో డ్రై ఫ్రూట్ వేసి కలపాలి.
- కావాలంటే చివరగా ఫుడ్ కలర్ వేసుకోవాలి.ఇది ఆప్షనల్.
- అంతే రుచికరమైన రవ్వ కేసరి రెడీ.
Post a Comment
If you have any doubts, Please let me know.