హాయ్ ఫ్రెండ్స్,
ఈరోజు మనం టేస్టీ గా దాబా స్టైల్ లో పెప్పర్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:-
చికెన్ అరకిలో
పసుపు కొద్దిగా
మిరియాలు 15
టొమాటో ముక్కలు అరకప్పు
ఉల్లిపాయ ముక్కలుపావుకప్పు
దనియాలపొడి రెండు స్పూన్లు
కరివేపాకు కొద్దిగా
వెల్లుల్లి తరుగు ఒక స్పూన్
నూనె సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా
కారం చిటికెడు
కొత్తిమీర
తయారుచేసే విధానం:-
- చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- మిరియాల్ని కచ్చాపచ్చాగా పొడి చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో ఉప్పు, మిరియాలపొడి, పసుపు కలపాలి.
- ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు పట్టించి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి.
- బాణలిలో నూనె వేసి లవంగాలు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి.
- వేగాక వెల్లుల్లి తురుము, టొమాటో ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
- బాగా వేగాక నానబెట్టిన చికెన్ ముక్కలు, కరివేపాకు వేసి ఒక నిమిషం వేయించాలి.
- టొమాటోలు మగ్గిన తరువాత అందులో కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి.
- అవసరమైతే మధ్యమధ్యలో కలుపుతుండాలి. చిటికెడు కారం, ధనియాల పొడి, కొత్తిమీర వేసి ఫ్రై చేసి దించేయాలి.
- అంతే రుచికరమైన పెప్పర్ చికెన్ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.