మునగాకు పచ్చడి/మునగాకు చట్నీ

హాయ్ ఫ్రెండ్స్,

ఈరోజు మనం టేస్టీ గా మునగాకు చట్నీ ఎలా చేయాలో చూద్దాం.

drumstick chutney

కావలసిన పదార్థాలు:-

ఆవాలు
జీలకర్ర
మెంతులు చిటికెడు
వెల్లుల్లి రెబ్బలు
చింతపండు కొద్దిగా
ఉప్పు
ఎండు మిరపకాయలు
కరివేపాకు
మినపప్పు
సెనగపప్పు
పసుపు చిటికెడు
మునగాకు

ఈ పచ్చడి పచ్చడి తింటే జబ్బులు త్వరగా తగ్గుతుంది.
మునగాకు మూడొందల జబ్బుల్ని నయం చేస్తుందంటారు.
మన పెద్దలు. అది నిజం. అత్యధిక పోషకాలు, విలువైన ఔషధాలు కలగలిసిన అద్భుతం మునగాకు.
వారానికి కనీసం రెండసార్లు ఏదో ఒక రూపంలో మునగాకు తింటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు.
 ఇలా పచ్చడి చేసుకుతింటే.. ఇంకా మంచిది.

తయారు చేసే విధానం:-

  • ఒక గిన్నె నిండా తాజా మునగాకును తీసుకోవాలి.
  • ఒక చెంచా ఉప్పు కలిపిన నీళ్లలో మునగాకును శుభ్రంగా
  • కడగాలి.
  • కడిగిన మునగాకును చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  • స్టౌ వెలిగించి పాన్ లో నూనె వేసి.. ఆవాలు, జీలకర్ర, మెంతులు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు,కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో మునగాకు, చింతపండు, ఉప్పు వేసి బాగా మగ్గించాలి.
  • ఇప్పుడు అన్నిటినీ చల్లార్చుకోవలి.
  • ఇప్పుడు మిక్సి జార్ లో ముందుగా అన్ని మసాలాలు ఫ్రై చేసినవి వేసి రుబ్బుకోవాలి.
  • తర్వాత అందులో మునగాకు, చింతపండు, ఉప్పు కలిపి ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమం వేసి గ్రైండ్ చేసుకోవాలి.
  • మెత్తగా చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర,ఆవాలు,ఎండుమిర్చి, కరివేపాకు మినపప్పు, సెనగపప్పు, పసుపు వేసి ఫ్రై చేసి పచ్చడిలో కలపాలి.
  • అంతే రుచికరమైన మునగాకు చట్నీ రెడీ.


తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.


0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️