ఆలూ పాలక్ కర్రీ

హాయ్ ఫ్రెండ్స్,

ఈరోజు మనం టేస్టీ గా ఆలూ పాలక్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం.


aloo palak curry

కావాల్సిన పదార్థాలు:-

బంగాళాదుంప
పాలకూర
ఉల్లిపాయలు
నూనె
జీలకర్ర 
ఆవాలు 
ఎండుమిర్చి 
కరివేపాకు
కొత్తిమీర
పసుపు 
అల్లం వెల్లుల్లి పేస్ట్
కారం తగినంత
ఉప్పు తగినంత
ధనియాల పొడి
నీళ్ళు

తయారు చేసే విధానం:-

  • ముందు ఆలూ, పాలకూర, ఉల్లిపాయలు కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కళాయి లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర ,ఎండుమిర్చి కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
  • ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలపాలి.
  • ఇప్పుడు అందులో ఉడికించి పెట్టుకున్న ఆలూ వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు కడిగి పెట్టుకున్న పాలకూర వేసి మగ్గించుకొవాలి.
  • మగ్గిన తరువాత అందులో తగినంత ఉప్పు, కారం,ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
  • ఇప్పుడు మూత పెట్టీ ఐదు నిమిషాలు ఉడికించాలి.
  • ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర వేసి దించేయాలి.
  • గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి.
  • ఫ్రై కాబట్టి నూనె కొంచెం ఎక్కువ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
  • అంతే రుచికరమైన రెసిపీ ఆలూ పాలక్ కర్రీ రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.

Also read: స్పైసీ గోంగూర పచ్చడి

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️