స్పైసీ గోంగూర పచ్చడి


హాయ్ ఫ్రెండ్స్,ఈరోజు మనం టేస్టీ గా క్రిస్పి ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.


కావలసిన పదార్థాలు:-

గోంగూర ఆకులు - 4 కప్పులు
ఎండుకొబ్బరి ముక్కలు
ఎండుమిర్చి 
వెల్లుల్లి రెబ్బలు -10 రెబ్బలు
జీలకర్ర -½ స్పూన్
ఇంగువ - చిటికెడు
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
నూనె
పచ్చిమిర్చి 15
సెనగపప్పు 
మినప్పప్పు 
జీలకర్ర
ఉల్లిపాయ ముక్కలు
కారేపాకూ

తయారు చేసే విధానం:-

  • గోంగుర ఆకులను కాడలు లేకుండా ఏరి, కడిగి జల్లెడలో వేసి ఆరనివ్వాలి.
  • స్టౌ వెలిగించి పాన్ లో కొద్దిగా నూనె పోసి పచ్చి మిర్చి, జీలకర్ర, ఎండుకొబ్బరి ముక్కలు కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  • అదే పాన్లో ఇంకొద్దిగా నూనె పోసి వేడి చేసి గోంగూర ఆకులు, పసుపు వేసి కలిపి మగ్గబెట్టాలి.
  • గోంగూర ఆకు పూర్తిగా మెత్తబడ్డాక స్టౌవ్ ఆఫ్ చల్లారనివ్వాలి.
  •  ఇప్పుడు మిక్సి జార్ లో పచ్చి మిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు  వేసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత అదే మిక్సి జార్ లో ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  • మెత్తగా రుబ్బుకున్న తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి తిప్పుకోవాలి.
  • ఉల్లిపాయ ముక్కలు బరకగా ఉంటే అవి చాలా రుచిగా ఉంటాయి ఉంటుంది.
  • పచ్చి మిర్చి ముద్ద, రబ్బుకున్న గోంగూర మిశ్రమం వేసి బాగా కలపాలి.
  • ఇప్పుడు వేరే పాన్లో నూనె కొంచెం ఎక్కువ వేసి వేడి చేసి ఇంగువ వేసి కరిగిన తర్వాత, అందులో ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, సెనగపప్పు  వేసి వేగిన తర్వాత పచ్చడి లో కలుపుకోవాలి.
  • ఇందులో నూనె కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది.
  • ఇది అన్నంలోకి, చపాతీ లోకి, దొసలోకి చాలా చాలా రుచిగా ఉంటుంది.
  • అంతే రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.



0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️