వినాయక చవితి స్పెషల్ చెక్కర పొంగలి/chekkara pongali

హాయ్ ఫ్రెండ్స్,

ఈరోజు మనం టేస్టీ గా ప్రసాదం చెక్కరపోంగలి ఎలా చేయాలో చూద్దాం.

చెక్కరపొంగలి:-


శ్రావణమాసంలో లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం మనం చాలా శ్రద్ధ తో పూజలు చేస్తూ ఉంటాము. అలాగే రకరకాల ప్రసాదాలు కూడా చేస్తూ ఉంటాము.
అందులో భాగంగానే ఈరోజు చెక్కర పొంగలిని ఎలా తయారు చేయాలో చూద్దాం.

చెక్కరపొంగలి  కూడా  వినాయకునికి చాలా ఇష్టమైన  ప్రసాదం . వినాయక చవితి సమయంలో ఇది  కూడా ప్రసాదం గా సమర్పిస్తారు.అందరు తప్పకుండా వినాయకచవితి నాడు వినాయకుడికి నైవేద్యం గా చెక్కరపొంగలి నివేదించండి. ఇది చాలా రుచిగా ఉంటుంది.పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం.తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి.

Chekkara pongali

కావలసిన పదార్థాలు:-

బియ్యం ఒక కప్పు
చెక్కర ముప్పావు కప్పు
పెసరపప్పు పావు కప్పు
నెయ్యి
ఎండు కొబ్బరి ముక్కలు
బాదం పప్పు ఒక స్పూన్
కిస్మిస్ ఒక స్పూన్
జీడిపప్పు ఒక స్పూన్
పాలు ఒక కప్పు


Sakkarai pongali

తయారు చేసే విధానం:-

  • ముందుగా బియ్యం కడిగి ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు పోసి పెట్టుకోవాలి.
  • పెసరపప్పు కడిగి చిన్న గిన్నెలో నీళ్లు పోసి నానపెట్టి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి.
  • వేడి అయిన తర్వాత అందులో జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు అన్ని ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్ మీద కడిగి పెట్టుకున్న బియ్యం పెట్టీ ఉడికించుకోవాలి.
  • బియ్యం ఉడకడానికి సమయం పడుతుంది. మద్య మద్యలో కలుపుతూ ఉడికించుకోవాలి.
  • బియ్యం సగం ఉడికిన తర్వాత అందులో నానపెట్టి పక్కన పెట్టుకున్న పెసరప్పును వేసుకొని బాగా కలిపి ఉడికించుకోవాలి.
  • ఉడుకుతున్న బియ్యం,పెసరపప్పు లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి.
  • తర్వాత చెక్కర వేసి బాగా కలుపుకోవాలి. అడుగు మాడిపోకుండా కలుపుతూ ఉండాలి.
  • ఇప్పుడు అందులో ఒక కప్పు పాలు పోసుకొని కలపాలి.
  • పాలు పచ్చివి ఐన వేడి చేసి అయిన పోసుకోవచ్చు.
  • బాగా మెత్తగా ఉడికించాలి. చివరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, కిస్మిస్,బాదం పప్పు వేసి కలిపి దించేయాలి.
  • అంతే రుచికరమైన వంటకం ప్రసాదం చెక్కర పొంగలి రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.


Post a Comment

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️