హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
మనం రోజు రకరకాలుగా స్వీట్ లు చేసుకుంటుంటాం. లడ్డు ,జిలేబి,గులాబ్ జాం ,రసగుల్లా ఇలా చాల రకాల స్వీట్స్ చేసుకుంటాం. ఐతే ఈరోజు నోరూరించే మైసూర్ పాక్ తయారు చేసే పద్దతి నేర్చుకుందాం……
కావలసిన పదార్థాలు :
సెనగ పిండి 1కప్పు
చెక్కర 1కప్పు
నెయ్యి 1కప్పు
నూనె సగం కప్పు
తయారు చేసే విధానం :-
- మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి కావలసిన అన్ని తయారు చేసి పెట్టుకోవాలి.
- స్టౌ వెలిగించి కడాయి పెట్టి చెక్కర పోసి పావు కప్పు నిల్లు పోసి తీగ పాకం పట్టుకోవాలి.
- ఇంకొక స్టౌ మీద గిన్నె లో నెయ్యి ,నూనె పోసి వేడి చేసుకుంటుండాలి.
- తర్వాత చెక్కర పాకం లో కొద్దీ కొద్దిగా సెనగపిండి వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
- మొత్తం పిండి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు సెనగపిండిలో కొద్దీ కొద్దిగా నెయ్యి పోస్తూ కలుపుకోవాలి.నెయ్యి కింద కూడా మంట ఆపకూడదు.
- సెనగపిండి లో నెయ్యి అంత పోసిన తర్వాత గుల్లగా బబుల్స్ ల వచ్చి నునే పైకి తేలుతూ వస్తుంది .
- అప్పుడు మైసూర్ పాక్ మిశ్రమాన్ని మొత్తం ఒక గిన్నెలో పోసుకొని చదునుగా చేసుకొని కత్తి తో గాట్లు పెట్టుకొని పూర్తిగా చల్లారేవరకు పక్కన పెట్టుకోవాలి.
- చల్లారిన తర్వాత ముక్కలు చేసుకోవాలి.అంతే మైసూర్ పాక్ రెడి.
తప్పకుండా ప్రయత్నించండి.మరియు లైక్ చేయండి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి.
Also read: పెసరపప్పు పూర్ణాలు/moong dal sweet
Post a Comment
If you have any doubts, Please let me know.