హయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం...
మనం ఈరోజు స్పైసీ ఆలూ చిప్స్ ఎలా చేయాలో చూద్దాం.... మనం మామూలుగా బైట స్వీట్ షాప్ లలో చిప్స్ తెచ్చుకొని తింటుంటాము. అచ్చు అలాంటి చిప్స్ ఈరోజు మన ఇంట్లో మనమే తయారు చేసుకుందాం....... ఎలాగో చూద్దాం....
కావలసిన పదార్థాలు:-
చిప్స్ చేసుకునే ఆలుగడ్డ
ఉప్పు రుచికి సరిపడా
నూనె వేయించడానికి సరిపడా
నీళ్ళు
చిటికెడు ఉప్పు
తగినంత కారం
తయారు చేసే విధానం:-
- చిప్స్ చేసుకునే ఆలుగడ్డ కడిగి పైన ఉన్న చెక్కు తీసి నీళ్లలో వేసి పెట్టుకోవాలి.
- నీళ్లలో వేసుకోక పొతే ఆలుగడ్డలు నల్లగా మారటానికి అవకాశం ఉంది.
- ఇంకొక గిన్నె తీసుకొని అందులో నీళ్ళు పోసుకుని అందులో ఒక స్పూన్ ఉప్పు వేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్లైసర్ తీసుకొని ఆలుగడ్డలు చిప్స్ లాగా కట్ చేసి ఉప్పు నీళ్లలో వేసుకోవాలి. లేకపోతే నల్లగా అవుతాయి.
- ఒక పది నిమిషాలు నానపెట్టి తీసి ఒక క్లాత్ మీద నీళ్ళు పోయే వరకు అరపెట్టుకోవలి.
- మొత్తం తడి పోయే వరకు అరపెట్టి పక్కన పెట్టుకోవాలి.
- స్టౌ వెలిగించి బాణలి లో నూనె పోసుకొని వేడి చేసి వేడయ్యాక అందులో చిప్స్ వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి.
- అన్ని చిప్స్ ఒక డబ్బాలో వేసుకోని పైనుండి ఉప్పు, కారం కొద్దిగా చల్లుకోవాలి.
- అంతే రుచికరమైన కరకరలాడే పొటాటో చిప్స్ రెడీ.
- తప్పకుండా ప్రయత్నించండి. మరియు లైక్ చెయ్యండి.
నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి.. మరియు షేర్ చేయండి..
Also read: మైసూర్ పాక్ / mysore pak
Post a Comment
If you have any doubts, Please let me know.