హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
ఈరోజు మనం ఇడ్లీ, దోశ,వడ లో కి ఎంతో రుచిగా వుండే పుట్నాలపప్పు, కందిపప్పు చట్నీ తయారి విధానం నేర్చుకుందాం........
కావలసిన పదార్థాలు:-
పుట్నాలపప్పు
కందిపప్పు
నూనె
పోపు గింజలు
ఎండు మిర్చి
చింత పండు కొద్దిగా
కరేపకు
కొత్తిమీర
చిన్న అల్లం ముక్క
పచ్చిమిర్చి
ఉప్పు
వెల్లుల్లి రెబ్బలు
తయారు చేసే విధానం:-
పుట్నాలపప్పు, కందిపప్పు చట్నీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి.
స్టౌ వెలిగించి పాన్ లో పుట్నలు,కందిపప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు పుట్నాలు, కందిపప్పు , పచ్చి మిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు,చిన్న అల్లం ముక్క, రెండు రెమ్మల చింతపండు,తగినన్ని నీళ్లు పోసి మిక్సి జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
చట్నీ లో మనకు కావలసిన అన్ని నిల్లు పోసుకొని చిక్కగా లేదా పలుచగా చేసుకోవాలి.
తర్వాత ఒక పాన్ లో నూనె పోసి బాగా కాగాక జీలకర్ర, ఎండుమిర్చి,కరివేపాకు,కొత్తిమీర,మినప్పప్పు, శెనగ పప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసి చట్నీ లో వేసి బాగా కలపాలి.
అంతే రుచికరమైన పుట్నాలపప్పు, కందిపప్పు చట్నీ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు లైక్ చెయ్యండి. నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.