హాయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం.
మనం రకరకాలుగా బిర్యానీ లు చేసుకుంటుంటాం.
ఈరోజు కాబూలీ చనా (చోలే) బిర్యానీ తయారు చేసే పద్దతి నేర్చుకుందాం.
కావలసిన పదార్థాలు :
బియ్యం
ఉడికించిన కాబూలీ శెనగలు
ఉల్లిపాయలు
నూనె
నెయ్యి
పచ్చిమిర్చి
కొత్తిమీర
పుదీనా
దాల్చిన చెక్క
లవంగాలు
మిరియాలు
సోంపు
షాజీరా
బిర్యానీ ఆకు
ధనియాలు
మరాఠా మొగ్గ
జాపత్రి
ఉప్పు
ఫుడ్ కలర్ లేదా కుంకుమ పువ్వు
తయారు చేసే విధానం :-
- ముందుగా కడాయి పెట్టి దాల్చిన చెక్క,లవంగాలు,మిరియాలు,సోంపు,షాజీరా,బిర్యానీఆకు,ధనియాలు,మరాఠా మొగ్గ ,జాపత్రి వేసి వేయించి పొడి చేసుకోవాలి.
- ఇప్పుడు కడాయిలో నూనె ,నెయ్యి పోసి వేడయ్యాక పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
- తర్వాత రెండు పచ్చిమిర్చి ,కొత్తిమీర ,పుదీనా ,ఉడికించిన కాబూలీ శెనగలు ,తయారు చేసుకున్న మసాలా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి.
- మరొక స్టౌ వెలిగించి గిన్నె పెట్టి నీళ్ల్లు పోసి మరిగించుకోవాలి.మరుగుతున్న నీటిలో షాజీరా ,మరాఠా మొగ్గ ,ఉప్పు నానపెట్టిన బియ్యం వేసి 80% ఉడికించుకోవాలి.
- ఇప్పుడు ఉడికిన అన్నం ను ఉడుకుతున్న చోలే మిశ్రమంలో పైన వేసుకోవాలి.ఫై నుండి కొద్దిగా కొత్తిమీర ,పుదీనా ,నెయ్యి ,ఫుడ్ కలర్ లేదా కుంకుమ పువ్వు ను పైనుండి చల్లుకోవాలి.
- ఇప్పుడు మూత పెట్టి చిన్న మంట మీద పది నిముషాలు స్టౌ మీద పెట్టి ఆతర్వాత ఆఫ్ చేసుకోవాలి.
- అంతే కాబూలీ శెనగలు (చోలే) బిర్యానీ రెడి.
తప్పకుండా ప్రయత్నించండి.మరియు లైక్ చేయండి.మీకు నచ్చితే ఫాలో అవ్వండి.
Post a Comment
If you have any doubts, Please let me know.