హెల్త్ టిప్స్ / health tips

హయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం...

ఈరోజు నాకు తెలిసిన, నేను తెలుకున్న, నేను చదివిన కొన్ని హెల్త్ టిప్స్ బీపీ, షుగర్ కి సంబంధిచినవి. మీతో పంచుకోవాలని అనుకుంటాను..

Cucumber

బీపీ, షుగర్ కి టిప్స్:-

  • కీర దోసకాయను మనం సలాడ్ లాగా వాడతాం. వేసవి కావడంతో దీని ఉపయోగం మరింత ఎక్కువగా ఉంటుంది.
  • కీరదోసతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ఇవి కొన్ని.
  • కీరదోసలో 90 శాతం నీరే ఉంటుంది. దాంతోపాటు ఖనిజలవణాలు కూడా చాలా ఎక్కువ.
  • అందుకే ఒంట్లో నీటిపాళ్లు తగ్గి డీ-హైడ్రేషన్‌కు గురైనప్పుడు వాటిని తక్షణం భర్తీచేయడానికి కీరదోస ముక్కలు తినడం ఉత్తమమైన మార్గం.
  • కీరదోసలో పొటాషియమ్ పాళ్లు చాలా ఎక్కువ. హైబీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా దీన్నితీసుకుంటే అది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
  • కీరదోసలో పీచు పాళ్లు చాలా ఎక్కువగా ఉండటం వల్ల అది దేహంలోకి చక్కెరను ఆలస్యంగా, నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది. కాబట్టి డయాబెటిస్ రోగులకు మేలు చేస్తుంది.
  • కీరదోసలో పీచుపదార్థాలు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంతో పాటు జీర్ణశక్తికి దోహద పడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.
  • కీరదోసలో మేనిని నిగనిగలాడేలా చేసేందుకు ఉపయోగపడే మెగ్నీషియమ్ వంటి పోషకాలు చాలా ఎక్కువ. అందుకే దీన్ని సౌందర్యసాధనంగా కూడా వాడతారు.
  • కీరదోసలోని యాంటీఆక్సిడెంట్స్ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి.కీరదోస ముఖ్యంగా మహిళల్లో రొమ్ముక్యాన్సర్లు,
  • పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్లను నివారిస్తుంది.
  • కీరదోసను మంచి డీ-టాక్సిఫైయింగ్ ఏజెంట్ గా పేర్కొనవచ్చు. అది ఒంట్లోని అనేక విషపదార్థాలను బయటకు పంపుతుంది.
  • కాలేయాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మూత్రపిండాలపై పడే అదనపు భారాన్ని తొలగిస్తుంది.
  • రక్తంలోని కొలెస్ట్రాల్ పాళ్లను అదుపులో ఉంచి, గుండె జబ్బులను నివారిస్తుంది.
తప్పకుండా ప్రయత్నించండి.మరియు లైక్ చెయ్యండి. నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️