హయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం....
ఈరోజు మనం పండు మిరపకాయల తో పండు మిర్చీ పచ్చడి తయారు చేసుకుందాం..ఈ సీజన్లో పండు మిరపకాయలు బాగా దొరుకుతాయి. కాబట్టి పండు మిర్చీ తో కావలసినన్ని వెరైటీలు చేసుకోవచ్చు..
కావలసిన పదార్థాలు:-
పండు మిరపకాయలు- ఇరవై
జీలకర్ర- రెండుటీస్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు- నాలుగు
ఉల్లిపాయ-ఒకటి
చింతపండు- కొద్దిగా
ఉప్పు- తగినంత
నూనె- ఒక నాలుగు స్పూన్లు
కరివేపాకు- రెండు రెమ్మలు
మినపప్పు
సెనగపప్పు
ఆవాలు
ఎండుమిర్చి
ఇంగువ
తయారు చేసే విధానం:-
- ఒక టీస్పూన్ జీలకర్రను వేగించి పక్కన పెట్టుకోవాలి. చింతపండు కొద్దిగా నీళ్ళు పోసుకుని నానపెట్టి పక్కన పెట్టుకోవాలి.
- ఉల్లిపాయలు సన్నగా తరగాలి. వెల్లుల్లి రెబ్బలను కట్ చేసుకోవాలి.
- స్టవ్ పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, మిరపకాయలు వేసి వేగించాలి.
- మిరపకాయలు వేగిన తరువాత స్టవ్ పై నుంచి దింపి చల్లారనివ్వాలి.
- తరువాత చింతపండు, తగినంత ఉప్పు జోడించి మిక్సీలో వేసి మెత్తని పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి.
- స్టవ్ పై మరో పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేయాలి.
- అవి వేగిన తరువాత సిద్ధంగా ఉన్న ఎండు మిరపకాయల పేస్ట్ వేసి కాసేపు ఉడికించాలి. కొద్దిగా నూనె పైకి తేలే వరకు ఉడికించి దించేయాలి.
- అంతే రుచికరమైన పండు మిర్చీ పచ్చడి రెడీ.ఈ కారంను దోశపై రాస్తే రుచిగా ఉంటుంది.
- ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఈ కారం వారం రోజులు నిల్వ ఉంటుంది.
తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.
Also read: హెల్త్ టిప్స్ / health tips
Post a Comment
If you have any doubts, Please let me know.