మసాలా చేపల కూర / Masala fish curry

హయ్ ఫ్రెండ్స్,
అందరికి నమస్కారం....

ఈరోజు మనం మసాలా చేపల కర్రీ తయారు చేసుకుందాం.. ఫిష్  అందరికీ ఇష్టమైన వంటకం. ఎగ్ తో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. కర్రీ, ఫ్రై, పులుసు ఇలా చాలా రకాలు. అయితే ఈరోజు మనం మసాలా చేపల కూర తయారు చేసే పద్ధతి నేర్చుకుందాం....

masala fish curry

కావలసిన పదార్థాలు:-

ఏదైనా ఒక రకం చేప ముక్కలు 

ఉప్పు-రుచికి తగినంత

జీలకర్ర  ఒక చెంచ 

మెంతులు సగం చెంచ 

మిరియాలు -పావుచెంచా

అల్లం వెల్లుల్లి పేస్ట్  

ఉల్లిపాయ-రెండు  పెద్దవి 

నూనె-నాలుగు  టేబుల్‌ స్పూను, 

కారం తగినంత 

దనియాల పొడి 


తయారు చేసే విదానం :-

  • ముందుగా  జీలకర్ర, మెంతులు వేరు వేరుగా ఫ్రై చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.అల్లం, వెల్లుల్లిని పేస్ట్  (పేస్ట్ ) మిశ్రమంలా చేసుకోవాలి.
  • ఇప్పుడు బాణలిలో చెంచా నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించి  చల్లాలి. రెండు నిమిషాలయ్యాక
  • ఉల్లిపాయ ముక్కల్ని పేస్ట్ ల చేసుకోవాలి.
  • చేపను శుభ్రం చేసి విడిపోకుండా ముక్కల్లా తరగాలి. ఇందులో కొద్దిగా ఉప్పు ,కారం, పట్టించి ఫ్రిజ్ లో ఉంచాలి. గంటయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా ,జిలకర మెంతుల పొడి , ఉల్లిపాయ పేస్ట్ అన్ని వేసి బాగా కలిపి మరొక అర గంట సేపు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
  •  ఇప్పుడు  పెనంపై  నూనె పోసి వేడి చేసి వేయించాలి. బంగారువర్ణంలోకి వచ్చేదాకా రెండువైపులా
  • కాల్చితే సరిపోతుంది. దీన్ని బ్రెడ్ రొట్టెలతో కలిపి తింటే ఆ రుచే వేరు.
  • అంతే రుచికరమైన మసాలా చేపల కూర రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.

0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️