సేమియా పకోడీ / semiya pakodi

హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.

రొటీన్ గా మనం ఉల్లిపాయలతో పకొడిలు చేసుకుంటాము. కాని ఈరోజు ఉల్లిపాయలతో కాకుండా వెరైటీగా ఆలూ పకోడి తయారు చేసుకున్నాం.ఈరోజు మనం సేమియా తో పకోడీలు చేసుకుందాం.. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించండి....

semiya pakoda


కావలసిన పదార్థాలు:-

సేమియా - ఒక కప్పు

కరివేపాకు తరుగు కొద్దిగా

పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు

ఉల్లి తరుగు - ఒక కప్పు

కారం - ఒక టీ స్పూను

శనగపిండి - ముప్పావు కప్పు

ఉప్పు- రుచికి

కొత్తిమీర తరుగు కొద్దిగా 

 నూనె - వేగించడానికి సరిపడా

తయారు చేసే విధానం:-

  • ముందుగా ఒక గ్లాసు నీరు మరిగించి సేమియా వేసి, సగం వరకు ఉడికించి తీసి వడకట్టి ఆరబెట్టాలి.
  • మిక్సింగ్ బౌల్ లో సేమియా, కరివేపాకు, ఉల్లి పాయ తరుగు , పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, కారం, ఉప్పు వేసి నీరు పోయకుండా కలపాలి.
  • ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత సేమియా మిశ్రమాన్ని పకోడీలుగా వేసుకుని మీడియం మంటపై దోరగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • సేమియా పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. ఉల్లిపాయలు ,టమాటో సాస్ తో వడ్డిస్తే చాల బాగుంటాయి.
  • అంతే రుచికరమైన సేమియా పకోడీలు రెడీ.

తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.


0/Post a Comment/Comments

If you have any doubts, Please let me know.

⬅️ Previous Next ➡️