హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్కారం.
రొటీన్ గా మనం అన్ని రకాల పండ్లతో జ్యూస్ లు చేసుకుంటాము. కాని ఈరోజు గ్రీన్ గ్రేప్స్ తో వెరైటీగా గ్రీన్ గ్రేప్స్ జ్యూస్ తయారు చేసుకుందాం.చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించండి....
కావలసిన పదార్థాలు:-
గ్రీన్ గ్రేప్స్ - పావు కిలో
చక్కెర - పావు కిలో
ఉప్పు - కొద్దిగా
గ్రీన్ గ్రేప్స్ షర్బత్
ఐస్ క్యూబ్ (ముక్కలు )
తయారు చేసే విధానం:-
- ద్రాక్షపళ్లను బాగా కడిగి మిక్సీ పట్టి వడకట్టాలి. పాన్ లో చక్కెర వేసి తగినన్నినీళ్లు పోసి పాకం వచ్చేంతవరకూ కలపాలి.
- కొంచెం పాకం రాగానే అందులో గ్రేప్ జూస్ వేసి బాగా మరిగించాలి.
- మరిగిన తర్వాత చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి.
- చల్లారాక, ఒక గ్లాసులో రెండు స్పూన్ల షర్బత్ వేసి, కొంచెం నీళ్లు, కొద్దిగా ఉప్పు, డ్రై ఫ్రూట్ ముక్కలు వేసుకుని తాగాలి.
- ఈ షర్బత్ ఫ్రిజ్ లో పెడితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది.
- తాగాలనుకున్నప్పుడు గ్లాసులో రెండు స్పూన్లు వేసుకుని, ఐస్ క్యూబ్స్, డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుని తాగితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది..
- అంతే రుచికరమైన గ్రీన్ గ్రేప్స్ జ్యూస్ రెడీ.
తప్పకుండా ప్రయత్నించండి మరియు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా షేర్ చేయండి.
Also read: సేమియా పకోడీ / semiya pakodi
Post a Comment
If you have any doubts, Please let me know.